అక్షరటుడే, గాంధారి: Chadmal Thanda Fire Accident | ఇంట్లో వాళ్లంతా ఆనందంగా బంధువుల ఇంటికి వెళ్లారు. కాని దురదృష్టవశాత్తు ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గాంధారి (Gandhari) మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Chadmal Thanda Fire Accident | గాంధారి మండల కేంద్రంలో..
స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం చద్మల్ తండాకు చెందిన రాయిదాస్ మంగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిమంటలు చెలరేగాయి దీంతో చుట్టుపక్కల వారు నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దాదాపు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న టేకు దుంగలు, పండించిన పంట ధాన్యం, బంగారం, వెండి వస్తువులు, నగదు బీరువాతో సహా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం ప్రాణం నష్టం సంభవించలేదు. దాదాపు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మ్యూజికల్ అండ్ మ్యాజికల్‌గా ‘రుత్తూ’ సాంగ్..