అక్షరటుడే, ఎల్లారెడ్డి: El Nino Awareness Rally | ఎల్‌నినో మీద అవగాహన కల్పించేందుకు మండల కేంద్రంలో(Yellareddy) ర్యాలీ నిర్వహించారు. ఇన్ఫినిటీ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.
El Nino Awareness Rally | స్థానిక బస్టాండ్ వద్ద..
స్థానిక బస్టాండ్ ఆవరణలో మెయిన్ రోడ్డు సమీపంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్‌నినో అంటే ఏమిటీ.. దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయాలను విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా వివరించారు. నీటిని పొదుపుగా వాడాలని ఇంకుడు గుంతలను ఉపయోగించాలని కోరారు. సాగునీరు తాగునీరు మనం పొదుపుగా వాడాలని పొలాల్లో పంట కుంటలు,ఇళ్లల్లో ఇంకుడు గుంతలు వాగులపైన దగ్గర వరదలు దగ్గర, చెక్ డ్యాములు నిర్మించాలని అన్నారు. విద్యుత్ శక్తి వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రవీణ జోషి ఉపాధ్యాయినులు రమ్యశ్రీ, సునీత, స్వర్ణలత, నాగమణి, అమీనా, ప్రియాంక, అనురాధ, కృష్ణవేణి, కృష్ణ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: శివాత్మిక రాజశేఖర్ ఎంత క్యూట్‌గా డాన్స్ చేసిందో చూడండి – బతుకమ్మ సాంగ్ లాంచ్ ఈవెంట్