Kamareddy adulterated toddy | కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఈగల్ టీం దాడులు!

దాడులు కొనసాగిన సమయంలో పట్టణంలోని కొన్ని కల్లు దుకాణాలు మూసివేసినట్లు సమాచారం.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy adulterated toddy | కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు వ్యవహారంపై ఈగల్ టీం ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఓ కల్లు డిపోపై ఈగల్ టీం ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. డిపోలో కల్తీ కల్లు తయారీకి వినియోగించే పదార్థాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

మంగళవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగినట్లు సమాచారం. డిపోలో తయారు చేస్తున్న కల్లు నమూనాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. డిపో నిర్వహణతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, డిపోను సీజ్ చేసినట్లు సమాచారం.

Kamareddy adulterated toddy | దాడులతో కల్లు దుకాణాల్లో కలకలం

ఈగల్ టీం ఆకస్మిక దాడులతో కామారెడ్డి పట్టణంలోని పలు కల్లు దుకాణాల నిర్వాహకులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. దాడులు కొనసాగిన సమయంలో పట్టణంలోని కొన్ని కల్లు దుకాణాలు మూసివేసినట్లు సమాచారం.

కల్తీ కల్లు విక్రయాలపై గత కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈగల్ టీం ప్రత్యేక నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం దాడులు జరిగిన డిపోపై కూడా పలుమార్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వాటి ఆధారంగానే నిఘా అనంతరం అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Kamareddy adulterated toddy | అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

అయితే కామారెడ్డిలో ఈగల్ టీం నిర్వహించిన దాడులు, స్వాధీనం చేసుకున్న పదార్థాలు, కేసుల వివరాలపై ఎక్సైజ్ శాఖ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. బుధవారం అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కామారెడ్డి పట్టణంలో ఈగల్ టీం తొలిసారిగా నిర్వహించిన ఈ తరహా దాడులతో కల్లు డిపోల నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారనే చర్చ సాగుతోంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *