అక్షరటుడే, బోధన్: Private Teachers Safety | ప్రైవేట్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ట్రస్మా (TRSMA) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ (bodhan) పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
Private Teachers Safety | బోధన్ పట్టణంలో..
నల్గొండలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు భారీర్యాలీ చేపట్టారు. వెయ్యి మందికి పైగా టీచర్లు ర్యాలీలో పాల్గొని ‘రూపారెడ్డి అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అనంతరం ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బోధన్ ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ పాల్గొన్నారు.