అక్షరటుడే, బోధన్: Salura Sarpanch Protest | నిజామాబాద్ జిల్లా సాలూర (salura) మండలంలోని సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు. తమ గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదని వారు గుర్రుగా ఉన్నారు.
Salura Sarpanch Protest | ప్రమాణస్వీకారం బహిష్కరణ..
ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పాల్గొన్న సాలూర సొసైటీ ఛైర్మన్ ప్రమాణస్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. అలాగే పింఛన్ల కార్యక్రమానిక సైతం వారు గైర్హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిధుల కోసం స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్తే తమకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సాలూరు మండలంపై బోధన్ మండల నాయకుల పెత్తనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అధికారిక కార్యక్రమాల్లో కూడా ప్రొటోకాల్ పాటించట్లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న సర్పంచులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. సాలూరు మండలంలో 12 మంది సర్పంచులు ఉండగా 11 మంది అధికారిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకుంటే తప్పేంటీ..?