Electric Car Fire | ఎలక్ట్రిక్​ కారులో మంటలు.. నలుగురు సజీవ దహనం

ఎలక్ట్రిక్​ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Electric Car Fire | విజయవాడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెయిలింగ్‌ను ఢీకొని విద్యుత్ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనం అయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని విజయవాడ పశ్చిమ బైపాస్‌పై రోడ్డు డివైడర్‌ను ఎలక్ట్రిక్​ కారు ఢీకొంది. అనంతరం కారులో మంటలు చెలరేగి, వేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని నలుగురు సజీవ దహనం కాగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. నంబూరులో జరిగిన వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను నున్న, నంబూరు ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రామ్‌దేవ్ (39), ఆయన తల్లి అరుణ, నంబూరుకు చెందిన తిగురు విజయ, ఒక చిన్నారి ఉన్నారు.

Electric Car Fire | పోలీసుల సహాయక చర్యలు

స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Nanabiyyam Bathukamma | నాలుగో రోజు ‘నానబియ్యం బతుకమ్మ’.. నైవేద్యం ఏంటంటే..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *