అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police | మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెకు కాబోయే భర్తపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగరంలోని (Nizamabad) ఐదో టౌన్ ఎస్సై సునీల్ వివరాలు వెల్లడించారు.
Nizamabad Police | న్యాల్కల్ రోడ్లో..
నగరంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో ఒక మహిళ తన కాబోయే భర్తతో ఉన్న సమయంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారు అప్పటికే మద్యం తాగి ఉన్నారు. ఆమె చేయి, చున్నీని లాగి అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా కాబోయే భర్తపై దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.4,000 నగదుతో పాటు స్కూటీని బలవంతంగా లాక్కొని వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్సై సునీల్ దర్యాప్తు చేపట్టి నిందితులైన గోడనే గణేష్, ప్రమోద్, పరమేశ్వర్లలో ప్రధాన నిందితుడైన గోడనే గణేష్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ నాయకులకు.. ప్రజల సమస్యలు పట్టవా..?