SSC Special Training Classes | ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: SSC Special Training Classes | ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించి అనంతరం మాట్లాడారు.

SSC Special Training Classes | ఆందోళన చెందవద్దు

కలెక్టర్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ భేటీ అయ్యారు. ఒకటి, రెండు సబ్జెక్టులలో తప్పిపోయినంత మాత్రాన అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలకు(SSC Supplementary Exams) మరో మూడు వారాల వరకు సమయం మిగిలి ఉన్నందున ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకోవాలని, శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తే, తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారని అన్నారు. జీవితంలో ఓటములు ఎదురవడం సహజమేనని, వాటిని భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు.

ఉన్నత స్థానాలకు చేరాలంటే షార్ట్ కట్స్ అంటూ ఏవీ ఉండవని, విద్యార్థి దశలో కష్టపడితే జీవితం అంతా సుఖ సంతోషాలతో గడపవచ్చని మార్గనిర్దేశం చేశారు. స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీలో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, సెల్ ఫోన్లను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కట్టడి చేయాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం స్మార్ట్ ఫోన్ల విషయంలో కొంత కటువుగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

SSC Special Training Classes | సమ్మర్ క్యాంప్​ను సందర్శించిన కలెక్టర్

వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కోసం శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్​ను(Summer Camp) కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ అంశాల్లో అందిస్తున్న తర్ఫీదు గురించి ఆరా తీశారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిరుచుల గురించి తెలుసుకున్నారు. వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్యాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెళుకువలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేస్తూ, చక్కగా సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ ప్రత్యేకంగా బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. విద్యా శాఖ అధికారి అశోక్, ఎంఈవోలు సాయిరెడ్డి, అరవింద్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయన్న తదితరులు ఉన్నారు.

coll 2

ఇది కూడా చదవండి: Mouni Roy Divorce | మౌనీ రాయ్ దాంపత్య జీవితంలో విభేదాలా.. విడాకుల ప్రచారంలో నిజమెంత‌?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *