Jantar Mantar Protest | జంతర్​మంతర్​ వద్ద ఆందోళన.. సీజేపీ నాయకుల అరెస్ట్​

జంతర్​మంతర్​ వద్ద నిరసన తెలిపేందుకు యత్నించిన సీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jantar Mantar Protest | జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశం హోదా నుండి కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో సీజేపీ నాయకులు మంగళవారం ఉదయం జంతర్​ మంతర్​ వద్ద ఆందోళనకు యత్నించారు.

అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ నేతృత్వంలో కార్యకర్తలు జంతర్​ మంతర్​కు వచ్చారు. ఈ మేరకు ఆకస్మిక నిరసన తెలిపారు. ఈ వీడియోను సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు ఇనుప గేటు, పోలీసు బారికేడ్లను ఎక్కి లోపలికి వెళ్లారు. అనంతరం ఢిల్లీ పోలీసులు (Delhi Police) వారిని అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశం జాబితా నుంచి తొలగించడంతో మీరు నిరసనను, ప్రతిఘటనను రద్దు చేయలేరు అని దీప్కే పోస్ట్ చేశారు.

Jantar Mantar Protest | మూడు కొత్త ప్రదేశాలు ఖరారు

అత్యంత భద్రత కలిగిన సెంట్రల్​ ఢిల్లీ ప్రాంతంలో ఉన్న జంతర్​మంతర్​ను ఇకపై నిరసనల కోసం వినియోగించొద్దని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు రాజధానిలో నిరసనలు, ధర్నాల కోసం మూడు కొత్త ప్రదేశాలను ఖరారు చేసింది. రామ్‌లీలా మైదానం, బురారీ మైదానం, తూర్పు ఢిల్లీలోని CBD మైదానంలో ఆందోళనలు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ఈ నెల 10 నుంచి పోలీసులు జంతర్​ మంతర్​ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనకారులను ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు.

ఇది కూడా చదవండి..: New State Governors | ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *