Vande Mataram Controversy | దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్​ : అమిత్​ షా

వందేమాతరం గేయం విషయంలో కాంగ్రెస్​ దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకుందని అమిత్​ షా అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Mataram Controversy | వందేమాతరం గేయం విషయంలో బీజేపీ, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వందేమాతరంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

సీడబ్ల్యూసీ బుధవారం సమావేశమై 1937 నాటి తమ తీర్మానాన్ని అనుసరిస్తూ వందేమాతరంలో కేవలం రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించింది. 1937లో ముస్లింలను బుజ్జగించేందుకు వందేమాతరాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్ దేశ విభజనకు పునాది వేసిందని అమిత్​ షా అన్నారు. నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ చేసిన ఆ తప్పును సరిదిద్దడమే కాకుండా, దానికి చట్టపరమైన రూపాన్ని కూడా కల్పించిందన్నారు. కాంగ్రెస్ నిర్ణయం వారి బుజ్జగింపు రాజకీయ విధానాన్ని ధృవీకరిస్తోందని విమర్శించారు.

Vande Mataram Controversy | బుజ్జగింపు రాజకీయాలు

కాంగ్రెస్​ బంకిమ్ బాబు సృష్టించిన ఈ గీతాన్ని అవమానించడమే కాకుండా, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన లక్షలాది మందిని కూడా అవమానించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన 1937 నాటి తీర్మానాన్ని అమలు చేస్తూనే, పార్లమెంటు చేసిన చట్టాన్ని తిరస్కరిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి బుజ్జగింపు రాజకీయాలను ముందుకు తీసుకు వెళ్తొందని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం ఏకం కావాలన్నారు.

ఇది కూడా చదవండి..: Supreme Court Bribery Case | రూ.20 లంచం కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *