Rahul Gandhi | మహిళా జర్నలిస్ట్​ను తోసేసిన రాహుల్ గాంధీ!

తనను రాహుల్​ గాంధీ తోసేశారని మహిళా జర్నలిస్ట్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rahul Gandhi | లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్​ గాంధీపై మహిళా జర్నలిస్ట్​ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్​ఐఆర్​ ప్రక్రియపై నిన్న సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన సమయంలో గర్భిణి అయిన తనను రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన చేతిని తోసి, లాగారని మహిళా జర్నలిస్ట్​ ఆరోపించారు.

వన్ఇండియా వెబ్‌సైట్‌కు చెందిన రిచా పరాశర్ ఈ మేరకు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆమె ఓ ఆస్పత్రిలో చేరారు. కాగా ఈ ఆరోపణలను కాంగ్రెస్​ ఖండించింది. బాధితురాలు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మద్దతుదారులు తన గురించి చెడుగా మాట్లాడటంతో తీవ్రంగా కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్​, బీజేపీకి సంబంధించిన విషయం కాదన్నారు.

Rahul Gandhi | కింద పడిపోయాను

పలువురు బీజేపీ నాయకులు ఆమెను పరామర్శించారు. రాహుల్ గాంధీ తనను గట్టిగా లాగారని ఆమె పేర్కొన్నారు. దీంతో తన మోకాళ్లు, పొట్ట గట్టి నేలకు తగిలి కింద పడిపోయానని ఆరోపించారు. రాహుల్​ గాంధీ తన కెమెరామెన్‌ను తోసేశారని, దాంతో అతను ఆమెపై పడిపోగా, అతని వెనుకే మరో నలుగురు-ఐదుగురు కూడా పడిపోయారని పేర్కొన్నారు. అనంతరం ఆయన సెక్యూరిటీ సిబ్బంది తమను పక్కకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను మెట్లపై పడిపోయానని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి..: Jantar Mantar Protest | జంతర్​మంతర్​ వద్ద ఆందోళన.. సీజేపీ నాయకుల అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *