అక్షరటుడే,కోటగిరి: Fuel Price Protest | పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలంటే కేంద్ర ప్రభుత్వం (Central Government) వీటిపై జీఎస్టీని ఎత్తివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు.
Fuel Price Protest | ఎన్నికలు ముగియతానే ధరల మోత..
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, మండల కార్యదర్శి ఏ.విఠల్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక సందర్భంగా పెట్రో ధరలు పెరగవని చెప్పిన ప్రధాని ఫలితాలు వచ్చాక పెంచడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వంలో రూ.300 ఉన్న గ్యాస్ ధర బీజేపీ హయాంలో రూ.1000కి పైగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు 45 రోజుల తర్వాతే గ్యాస్ దొరికే అవకాశముందని.. కమర్షియల్ గ్యాస్ దొరకక చిరు వ్యాపారులు హోటళ్లు మూసివేస్తున్నారన్నారు.
దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి పేదలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై జీఎస్టీ తెచ్చిందని పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీని ఎత్తివేస్తేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు నల్ల గంగాధర్, నీలి శంకర్, రాజు, రాములు, హన్మాండ్లు, అన్సార్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..


