Nizamabad Voter Registration | 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్​ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Voter Registration | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

Nizamabad Voter Registration | అన్ని నియోజకవర్గాల పరిధిలో..

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు (స్పెషల్ క్యాంపెయిన్) నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా ప్రతి బూత్ లెవల్ అధికారి (BLO) తమకు కేటాయించిన నిర్దేశిత ప్రదేశంలో అందుబాటులో ఉంటారని అన్నారు. ఓటర్లకు అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8లతో పాటు ముసాయిదా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుతామన్నారు.

Nizamabad Voter Registration | పేర్ల తొలగింపుపై అభ్యంతరాలు

కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన వారు ఫారం-6 ద్వారా, ఓటరు జాబితాలోని పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలకు ఫారం-7 ద్వారా, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా మార్పు వంటి వాటికి ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవల్ అధికారులతో పాటు బూత్ లెవల్ ఏజెంట్లు కూడా అందుబాటులో ఉండాలని, ముసాయిదా ఓటరు జాబితాను ఓటర్లు పరిశీలించేందుకు సహకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన సవరణలు, మార్పులు లేదా కొత్తగా ఓటరు నమోదు కోసం స్పెషల్ క్యాంపెయిన్ రోజుల్లో తమ సమీప పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ఇది కూడా చదవండి..: Farmer Burns Paddy Crop | ఓవైపు కరెంటు కోత.. మరోవైపు దోమపోటు.. చేసేదేంలేక పంటకు నిప్పు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *