Farmer Burns Paddy Crop | ఓవైపు కరెంటు కోత.. మరోవైపు దోమపోటు.. చేసేదేంలేక పంటకు నిప్పు

వరికి దోమపోటు రావడం, మరోవైపు కరెంట్​ కోతలతో విసుగు చెందిన రైతు పంటకు నిప్పు పెట్టాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Farmer Burns Paddy Crop | సర్కారు చెప్పిందని సన్నరకం వేశాడు ఆరైతు.. కాని దోమపోటు ఓవైపు.. కరెంటు కోతలు మరోవైపు.. దీంతో చేసేదేంలేక కన్నీళ్లు దిగమింగుకుని పంటకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన పాల్వంచ మండలం (Palvancha Mandal) ఫరీద్​పేటలో బుధవారం జరిగింది.

Farmer Burns Paddy Crop | 10 ఎకరాల్లో వరి పంట..

ఫరీద్​పేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి 5 ఎకరాల సొంత భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం సన్నరకం పంట వేయాలని సూచించడంతో సన్నరకం పంట వేశాడు. పంట వేసే సమయంలో దోమపోటు సోకకుండా మూడు నాలుగు సార్లు పురుగు మందు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దానికి తోడు పంటకు సరిపడా నీళ్లు లేకపోవడం, కరెంట్ కొరత ఉండటంతో విసుగు చెందిన రైతు బుధవారం డీజిల్ చల్లి పంటకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.

ఇది కూడా చదవండి..: Bathukamma Celebrations | ఉషోదయ విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *