Urea Slot Booking | మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్ : కలెక్టర్ ఇలా త్రిపాఠి

రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Urea Slot Booking | రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీని (Fertilizer Booking) మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. మీ-సేవ (MeeSeva) కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్‌ కు అవకాశం కల్పించిందన్నారు.

Urea Slot Booking | అన్ని మీ సేవ కేంద్రాల్లో..

అన్ని మీ సేవ (MeeSeva) కేంద్రాల్లో యూరియా బుకింగ్ విధానం(Urea Distribution) అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ లేని, స్వయంగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీ-సేవ కేంద్రాన్ని సందర్శించి బుక్ చేసుకోవచ్చని అన్నారు. స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో తమ అవసరాలకు సరిపడా యూరియా ఎరువులు పొందాలని కలెక్టర్ సూచించారు. కాగా, ఈ విషయమై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

MeeSeva Urea Booking

ఇది కూడా చదవండి: శంషాబాద్‌లో బొలెరో వాహనం బీభత్సం 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *