Telangana Weather Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో  నేటి నుంచి 18వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో కూడిన (గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Weather Alert | రాష్ట్రంలో  నేటి నుంచి 18వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో కూడిన (గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ‘ఎల్లో’ అలెర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోతుండగా, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.

Telangana Weather Alert | జిల్లాల వివరాలు..

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట , జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే దాదాపు 6 డిగ్రీలు ఎక్కువగా 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, హైదరాబాద్‌లలోనూ ( Hyderabad )  ఎండ తీవ్రత కొనసాగుతోంది.

Telangana Weather Alert | సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

రాష్ట్రంలో తలెత్తుతున్న ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని సుమారు 235 మండలాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది జూన్, జులై నాటికి పరిస్థితులు మరింత క్షీణించకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. కరవు మండలాల ప్రకటనతో పాటు కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సాయం కోరేందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

ఇది కూడా చదవండి:  Reservation Verdict | మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *