Palle Ravi Kumar Gaud | కేటీఆర్ పీఆర్వో, పీఏలపై పోలీస్ స్టేషన్‌లో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : పల్లె రవికుమార్ గౌడ్

ఘటనకు సంబంధించిన పూర్తి సీసీ టీవీ ఫుటేజీను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దాడికి యత్నించిన పోలీసులను తక్షణమే గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Palle Ravi Kumar Gaud | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, జర్నలిస్టు ఎం. మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్‌లపై పోలీస్ స్టేషన్ సాక్షిగా ముసుగులు ధరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడికి యత్నించడాన్ని కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.

Palle Ravi Kumar Gaud | ఇంటరాగేషన్ రూమ్‌లో దాడికి యత్నం

పండగ రోజున కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఇంటరాగేషన్ రూమ్‌లో వారిపై దాడికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ టీమ్ గమనించి కేకలు వేసి అడ్డుకోవడంతో ముసుగు ధరించిన వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు.

NCP MPs BJP | బీజేపీకి బిగ్ బూస్ట్?.. 17 మంది NCP ఎంపీలు కాషాయ గూటికి.. లోక్‌సభలో 257కి బలం!

Palle Ravi Kumar Gaud | సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి

పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులపై స్టేషన్ లోపలే దాడులకు తెగబడటం రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని విమర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సీసీ టీవీ ఫుటేజీను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దాడికి యత్నించిన పోలీసులను తక్షణమే గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.

ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై దాడులు చేయడం నయా రజాకార్ల పాలనను తలపిస్తోందని రవికుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరాచకాలకు భవిష్యత్తులో వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *