World No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : World No Tobacco Day | ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)​లో​ అవగాహన పోస్టర్​ ఆవిష్కరించారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ తరఫున ఐపీఎస్ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్, ఐపీఎస్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్, ఐఎంఏ తెలంగాణ స్టేట్ మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ కమిటీల సహకారంతో ఐపీఎస్ సౌత్ జోన్ మిడ్-టర్మ్ సీఎంఈలో దీనిని విడుదల చేశారు.

World No Tobacco Day

World No Tobacco Day | మానుకోవాలి

పొగాకు వాడకంతో కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, పొగాకు వాడకాన్ని మానుకోవడాన్ని ప్రోత్సహించడం లక్ష్యమని పేర్కొన్నారు. పొగాకు రహిత జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. పొగాకు సంబంధిత అనారోగ్యాలను నివారించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం పట్ల మానసిక వైద్య నిపుణులు, ఆరోగ్య సంరక్షణ సంస్థల నిబద్ధతను ఈ పోస్టర్ విడుదల ప్రతిబింబిస్తుందని వక్తలు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Municipal Transfers | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *