June Bank Holidays | బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్ లో ఏయే రోజుల్లో బంద్ ఉంటాయంటే?

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: June Bank Holidays | వచ్చేనెల(జూన్ )కు సంబంధించిన బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విడుదల చేసింది. ఇందులో జాతీయ సెలవులతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక రోజుల్లో సెలవులున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణ (Telangana)లోని బ్యాంకులకు ఎనిమిది రోజుల సెలవులు వచ్చాయి.

ఇందులో వారాంతపు సెలవులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు మాత్రమే మÖసి ఉంటాయి. బ్యాంకింగ్ సెలవుల సమయంలో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యÖపీఐ, ఏటీఎంల ద్వారా సేవలను పొందవచ్చు. చెక్ క్లియరింగ్, ఇతర ఓవర్ ది కౌంటర్ సేవలు మాత్రం అందుబాటులో ఉండవు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు పనులకోసం బ్యాంకులకు వెళ్లేవారు ఈ సెలవులను గమనించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. సెలవుల వివరాలు తెలుసుకుందాం..

June Bank Holidays | వారాంతపు సెలవులు

June Bank Holidays

అన్ని ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు.
జూన్ 7 (ఆదివారం)
జూన్ 13 (రెండో శనివారం)
జూన్ 14 (ఆదివారం)
జూన్ 21 (ఆదివారం)
జూన్ 27 (నాలుగో శనివారం)
జూన్ 28 (ఆదివారం)

June Bank Holidays | తెలంగాణలో ఇతర సెలవులు..

June Bank Holidays

జూన్ 2 (మంగళవారం) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
జూన్ 26 (శుక్రవారం) : మొహర్రం.

June Bank Holidays | ఇతర రాష్ట్రాల్లో..

జూన్ 15 (సోమవారం): ఐజ్వాల్‌లో వైఎమ్ ఏ డే, భువనేశ్వర్‌లో ‘రాజ సంక్రాంతి’ పండుగ సందర్భంగా ఆ రాష్ట్రాల్లోని బ్యాంకులు బంద్ ఉంటాయి.
జూన్ 17 (బుధవారం): మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హర్యానాలో బ్యాంకులకు సెలవు.
జూన్ 18 (గురువారం): శ్రీ గురు అర్జున్ దేవ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలో బ్యాంకులు బంద్.
జూన్ 22 (సోమవారం): ప్రసిద్ధ జగన్నాథ ‘రథయాత్ర’ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఇస్తారు.
జూన్ 26 (శుక్రవారం): మొహర్రం సందర్భంగా చాలా రాష్ట్రాలలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

ఇది కూడా చదవండి..: Vijay Trisha | అజిత్ ఇంటికి కలిసి వెళ్లిన విజయ్, త్రిష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *