అక్షరటుడే, వెబ్డెస్క్: Kolkata Warehouse Collapse | కోల్కతా (Kolkata)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడౌన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమ కోల్కతాలోని తారతాల ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఒక గిడ్డంగి (warehouse) కూలిపోవడంతో, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు పని చేస్తున్నారని, శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
Kolkata Warehouse Collapse | కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. కోల్కతా పోలీసులు, విపత్తు నిర్వహణ విభాగం (Disaster Management Group), సివిల్ డిఫెన్స్ మరియు అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగాలకు చెందిన రక్షణ బృందాలను సంఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యల్లో సైనిక సిబ్బంది కూడా పాలుపంచుకుంటున్నారు. శిథిలాలను తొలగించడానికి, చిక్కుకుపోయిన వారి కోసం గాలించడానికి క్రేన్లు, భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
Kolkata Warehouse Collapse | మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రమాద సమయంలో 60 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు అధికారులు ఏడుగురిని సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
2 Killed Several trapped after under-construction warehouse shed collapses at Taratala in Kolkata pic.twitter.com/RduZYY8rTn
— Shakeel Yasar Ullah (@yasarullah) June 24, 2026
దీనిని కూడా చదవండి: RBI Interest Rates | వడ్డీ రేట్ల పెంపు లేదు.. ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన