Vijay TVK Victory|తమిళ రాజకీయం ‘విజయ్’మయం.. ద్రావిడ కోటలు బద్ధలు కొట్టిన టీవీకే!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay TVK Victory|తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త శకం ఆరంభమైంది. అగ్ర నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి ఎన్నికల్లోనే కళ్లు చెదిరే ఫలితాలను సాధిస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ పార్టీల కోటలకు విజయ్ బీటలు వారుస్తూ, అసెంబ్లీలో ఒక ప్రధాన శక్తిగా అవతరించారు.

Vijay TVK Victory|రెండు చోట్లా విజయభేరి..

టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ అఖండ విజయం సాధించి తన సత్తా చాటారు. పెరంబూర్ నుంచి బరిలోకి దిగిన విజయ్, తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై సుమారు 40 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో విజయ్ ఘన విజయం సాధించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పెరంబూర్‌తో పాటు తిరుచ్చి ఈస్ట్‌లోనూ విజయ్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అక్కడ కూడా ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచి డబుల్ విక్టరీని నమోదు చేశారు.

Vijay TVK Victory|రాష్ట్రవ్యాప్తంగా టీవీకే హవా..

కేవలం విజయ్ గెలుపు మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా టీవీకే అభ్యర్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, దాదాపు 109 నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అధికార డీఎంకే , ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలకు గట్టి పోటీనిస్తూ విజయ్ సేన ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలతో విజయ్ ‘కింగ్ మేకర్’గా లేదా అంతకంటే పెద్ద స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Vijay TVK Victory|మార్పు కోరుకున్న ప్రజలు..

రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్న యువత , సామాన్య ప్రజలు విజయ్ నాయకత్వానికి పెద్దపీట వేసినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సినీ గ్లామర్‌కు తోడు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల కఠోర శ్రమ, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలు ఈ విజయానికి పునాదులు వేశాయి. ముఖ్యంగా కోలాత్తూర్ వంటి దిగ్గజ నియోజకవర్గాల్లోనూ టీవీకే గట్టి పోటీనిస్తూ ద్రావిడ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది.

ఈ అఖండ విజయంపై విజయ్ అభిమానులు , టీవీకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే అడుగుపెట్టడం అనేది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది.

ఇది కూడా చదవండి: BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *