Sonam Wangchuk | చికిత్స పేరుతో నిర్బంధం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో, ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బంధించడంపై ఆయన సతీమణి గీతాంజలి అంగ్మో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sonam Wangchuk  | సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో, ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బంధించడంపై ఆయన సతీమణి గీతాంజలి అంగ్మో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ హైకోర్టులో ( Delhi High Court ) అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Sonam Wangchuk | చికిత్స పేరుతో..

నీట్ (NEET) పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా ఆయన ఆరోగ్యం శనివారం ఒక్కసారిగా క్షీణించడంతో, పోలీసులు బలవంతంగా ఆయన్ను సఫ్దర్‌జంగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో తన భర్తను చికిత్స పేరుతో ‘చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తున్నారని’ గీతాంజలి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆసుపత్రి ఫ్లోర్‌లో సుమారు 30 మంది, ఆవరణలో 100 మందికి పైగా పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. కనీసం తమ న్యాయవాదులను లేదా గతంలో చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యులను కలిసేందుకు కూడా అనుమతి నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వైద్యం కాదని, ప్రాథమిక హక్కులను కాలరాసే ‘నిర్బంధం’ అని ఆమె వాదించారు.

Sonam Wangchuk | అత్యవసర పిటిషన్..

తన భర్తను ప్రస్తుత ఆసుపత్రి నిర్బంధం నుంచి విడుదల చేయాలని, చికిత్స కోసం తమకు నమ్మకమున్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించాలని గీతాంజలి అంగ్మో హైకోర్టును అభ్యర్థించారు. ఈ అత్యవసర పిటిషన్ పై న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి:  Jammu Kashmir Flash Floods | జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు.. 11 మంది మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *