అక్షరటుడే, వెబ్‌డెస్క్: Permanent Jobs For Youth | దేశంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు లభించడం లేదని లోక్‌సభ Loksabha ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ Rahul Gandhi అన్నారు. ప్రతి 1,000 మంది యువతలో కేవలం 12 మందికే శాశ్వత ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Permanent Jobs For Youth | 21వ శతాబ్దపు వ్యసనంగా డిజిటల్ కంటెంట్
యువతకు సంబంధించిన డేటా కూడా వారి చేతుల్లో లేకుండా పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. జియో, అదానీ, ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలకు ప్రజల డేటా అప్పగించబడుతోందని అన్నారు.
Kavitha’s BC Slogan | బీసీ నినాదం.. అవకాశవాద రాజకీయాల ఓటు బ్యాంక్ గేమ్!
సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్‌ను 21వ శతాబ్దపు కొత్త వ్యసనంగా రాహుల్ అభివర్ణించారు. ‘‘ఎన్ని రీల్స్ అయినా చూడండి, ఎన్ని వాట్సాప్ సందేశాలైనా పంపండి, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేయండి, కంటెంట్ సృష్టించండి..’’ అంటూ యువతను డిజిటల్ ప్రపంచంలో నిమగ్నం చేస్తున్నారని విమర్శించారు.
Permanent Jobs For Youth | యువతకు లేబర్ పనులే దిక్కు
అదే సమయంలో యువతకు బ్లింకిట్, ఉబర్ వంటి గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మాన్యువల్ లేబర్ వంటి పనులు మాత్రమే మిగులుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
యువత డిజిటల్ వ్యసనంలో చిక్కుకుంటున్నప్పటికీ, వారికి స్థిరమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదని రాహుల్ పేర్కొన్నారు.