అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief | పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌పై(Bomma Mahesh Kumar Goud) ఎంపీ అర్వింద్ (MP arvind)అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
PCC Chief | అర్వింద్ చేసిందేమి లేదు
పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కంటే ఎంపీ అర్వింద్ చిన్నవాడైనప్పటికీ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని రాంభూపాల్ పేర్కొన్నారు. అనంతరం విపుల్ గౌడ్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు అర్వింద్ చాలా చిన్నవాడన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎల్లప్పుడూ జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి అని, అర్వింద్ పార్లమెంట్ పరిధిలో చేసిందేమీ లేదన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేలేని అసమర్థ ఎంపీ అర్వింద్ అని విపుల్ గౌడ్ విమర్శించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్లు నిజామాబాద్‌లో తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్‌పై బీజేపీ కార్పొరేటర్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైనది కాదన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్ యాదవ్, పంచారెడ్డి చరణ్, కో ఆప్షన్ మెంబర్ బొబ్బిలి మధురి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు