అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ASI Promotions | బాసర జోన్ (Basara Zone) పరిధిలో పలువురు ఏఎస్సైలకు ప్రమోషన్ లభించింది. ఈ మేరకు జోన్–2 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 18 మందికి పదోన్నతి కల్పించారు.
నిజామాబాద్ (Nizamabad) కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఏఎస్సై జాన్సన్ ఎస్సైగా పదోన్నతి పొందారు. ఆయనను నిజామాబాద్ మెడికల్ గ్రౌండ్స్‌కు నియమించారు. జి రాజేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్, ఎ శ్రీనివాస్‌రెడ్డి, బి సాయిలు, ఎండీ లాయక్ అలీ, డి చిన్న గంగారాం, ఎస్కే గఫార్, కె బాబు, పి శంకర్, డి రేణుక పదోన్నతి పొందారు. వీరికి బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు.
ASI Promotions | ఇతర జిల్లాల్లో..
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు చెందిన ఏఎస్సైలు అనిత, గంగాధర్, నిర్మల్ జిల్లాకు చెందిన కె లక్ష్మణ్, జగిత్యాలకు జిల్లాకు చెందిన మహ్మద్ జమీల్ అహ్మద్, మహ్మద్ అలీముద్దీన్, కొడిమ్యాల వెంకటేశ్వర్లు, శ్యామ్‌రావు నర్సింగ్‌రావు ఎస్సైలుగా ప్రమోషన్ పొందారు.
దీనిని కూడా చదవండి : Anti Paper Leak Bill | పార్లమెంట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న యాంటీ-పేపర్ లీక్ బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్