ISB 25 Scholars | మేనేజ్‌మెంట్ విద్య ఇక మరింత ఈజీ.. 25వ వార్షికోత్సవ వేళ ఐఎస్‌బీ బిగ్ అనౌన్స్‌మెంట్

దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూల్‌గా పేరుగాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'ISB @25' పేరుతో సరికొత్త దీర్ఘకాలిక కార్యక్రమాలను ప్రకటించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  ‌ISB 25 Scholars | దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూల్‌గా పేరుగాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘ISB @25’ పేరుతో సరికొత్త దీర్ఘకాలిక కార్యక్రమాలను ప్రకటించింది. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశంలో నంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానంలో నిలిచిన ఐఎస్‌‌బీ.. మేనేజ్‌మెంట్ విద్యను మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ISB 25 Scholars | 250 మందికి స్కాలర్‌షిప్‌లు..

‘ISB 25 స్కాలర్స్ ప్రోగ్రామ్’ కింద ఇకపై ప్రతిఏటా పీజీపీ (PGP), యంగ్ లీడర్స్ పీజీపీ (PGP YL) కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఏకంగా 250 స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నారు. ప్రతిభ , ఆర్థిక పరిస్థితి (Merit-cum-Need) ఆధారంగా ట్యూషన్ ఫీజులో 100%, 50%, 30%, లేదా 25% వరకు రాయితీ కల్పిస్తారు. దీనివల్ల వివిధ ఆర్థిక, ప్రాంతీయ నేపథ్యాల నుంచి వచ్చే ప్రజ్ఞావంతులకు ప్రపంచ స్థాయి మేనేజ్‌మెంట్ విద్య సులభంగా అందుతుంది.

ISB 25 Scholars | ‘ఇండియా రీసెర్చ్ కామన్స్’..

దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు సహాయపడేలా ‘ఇండియా రీసెర్చ్ కామన్స్’ పేరిట ఒక జాతీయ వేదికను ఐఎస్‌బీ ప్రారంభించనుంది. దీని ద్వారా ఎంపిక చేసిన డేటాసెట్లు, పరిశోధనా సాధనాలు , ఏఐ (AI) ఆధారిత వనరులు పరిశోధకులకు అందుబాటులోకి వస్తాయి. అలాగే దేశంలోని ఇతర మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలతో తమ బోధనా పద్ధతులను పంచుకునేందుకు ఒక కొత్త జాతీయ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని కూడా తేనున్నారు.

ఐఎస్‌బీ ప్రత్యేకతలు..2001లో ఏర్పాటైన ఐఎస్‌బీ.. ఇప్పటివరకు 65కు పైగా దేశాల్లో 20,000 మందికి పైగా పూర్వ విద్యార్థులతో అగ్రశ్రేణి సంస్థగా ఎదిగింది. ఎఫ్‌టీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026లో కోర్సుకు ముందు, ఆ తర్వాత జీతాల పెరుగుదల శాతంలో ఐఎస్‌బీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లు కలిగిన ఈ సంస్థ.. భవిష్యత్తు వ్యాపార నాయకులను తీర్చిదిద్దడంలో తన వంతు పాత్రను మరింత విస్తృతం చేస్తోంది. ఈ కార్యక్రమాలపై ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిలుట్ల మాట్లాడుతూ.. “మా 25 ఏళ్ల ప్రయాణాన్ని వేడుక చేసుకోవడంతో పాటు, భవిష్యత్తులో అత్యుత్తమ విద్యను అందరికీ మరింత చేరువ చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

ఇది కూడ ాచదవండి:  Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *