తెలంగాణPawan Kalyan Press Meet | తెలంగాణ మీ అయ్య జాగీరా?: విమర్శకులపై కల్యాణ్ పవర్...

Pawan Kalyan Press Meet | తెలంగాణ మీ అయ్య జాగీరా?: విమర్శకులపై కల్యాణ్ పవర్ ఫైర్

తెలంగాణ ప్రాంతంపై తనకు, తన జనసేన పార్టీకి ఉన్నది రాజకీయాలకు అతీతమైన స్వచ్ఛమైన ప్రేమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pawan Kalyan Press Meet | తెలంగాణ ప్రాంతంపై తనకు, తన జనసేన పార్టీకి ఉన్నది రాజకీయాలకు అతీతమైన స్వచ్ఛమైన ప్రేమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ నడిబొడ్డునే జనసేన జన్మించిందని గుర్తుచేసిన ఆయన.. “తెలంగాణలో జనసేన ఎందుకు?” అని ప్రశ్నించే విమర్శకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో లక్ష మందికి పైగా జనసేన సైనికులు, నాయకులు ఉన్నారని.. ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ విభజనతో కొత్తగా వచ్చింది కాదన్నారు. తాను సామాజిక తెలంగాణను ఆకాంక్షించే వ్యక్తినని, కాకపోతే పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే వ్యతిరేకించానని తేల్చిచెప్పారు.

Pawan Kalyan Press Meet | తెలంగాణ మీ అయ్య జాగీరా?

తాను తెలంగాణకు లేదా హైదరాబాద్‌కు వస్తే అడ్డుకుంటామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. తాను ఇక్కడ అధికారం కోసం కాకుండా, కేవలం మార్పు కోసమే వస్తున్నానని చెప్పారు. ఒక విశ్లేషకుడు చేసిన తప్పుడు విమర్శల వల్లే ఈ వివాదమంతా మొదలైందని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోయినా, పరిశ్రమలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రవాళ్లను బాధ్యులను చేయడం ఏంటని ప్రశ్నించారు. పాలకులు వేరు, ప్రజలు వేరనే విషయాన్ని ఇక్కడి ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణకు తాను అన్యాయం చేసినట్లు నిరూపిస్తే తనను ఉరేయవచ్చని.. భయపెట్టే రోజులు పోయాయని, రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని, అందుకోసం తానే స్వయంగా రాష్ట్రమంతా పర్యటిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

pawan.1 1

Pawan Kalyan Press Meet | ఆరోపణలు నిజమైతే ఈ క్షణమే రాసిచ్చేస్తా..

నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం, అభిమానం ఉంది” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఎంను ఉద్దేశించి ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కోడి చెరువును ఆక్రమించుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఒకవేళ తాను చెరువును కబ్జా చేసినట్లు తేలితే.. ఆ భూమిని ఈ క్షణమే ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తానని సీఎంకు సవాల్ విసిరారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తాము ఎన్నో దాడులను చూశామని, ఇవేమీ తమకు కొత్త కాదన్నారు. నాడు తెలంగాణకు వ్యతిరేకమని వైఎస్ బహిరంగంగా చెప్పినా.. ఆయనకే ఊడిగం చేసిన కొందరు నేతలు ఇప్పుడు తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

pawan 1

Pawan Kalyan Press Meet | నా సినిమాల్లోనూ ఆ పోరాట స్ఫూర్తి ఉంది..

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆలోచన రాకముందు నుంచే తాను తెలంగాణ మట్టి నుంచి పోరాట స్ఫూర్తిని పొందానని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆ స్ఫూర్తి తన సినిమాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గతంలో ఓట్ల కోసం కాకుండా, మానవత్వంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో, గోండు తాండాల్లో తిరిగి అక్కడి ప్రజల దాహార్తిని తీర్చామని చెప్పారు. ఏపీలో తనను తిరగనివ్వని పరిస్థితుల్లో తెలంగాణే తన ‘వారాహి’ వాహనానికి పర్మిషన్ ఇచ్చిందని, కోదాడ, నల్గొండ ప్రజలు తనకు అండగా నిలిచారని కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. తనపై దాడి చేయాలనుకునే వారు దొంగదెబ్బ తీయకుండా, నేరుగా తన ఇంటికే రావాలనే ధీమాతోనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టానని.. తాము ఎవరికీ బాంచన్ అనే రకం కాదని, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు.

ఇది కూడా చదవండి: Employee Health Cards | హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...