Godavari Pushkaralu | గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి

Srinivas Kolluri

అక్షరటుడే, ఇందూరు: Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సి ఉన్న పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు.

గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. దేవాదాయ, నీటి పారుదల శాఖల అధ్వర్యంలో సవరించిన ప్రతిపాదనలను బుధవారంలోగా పంపించాలని, పంచాయతీరాజ్, ఆర్​అండ్​బీ తదితర శాఖల ద్వారా కూడా రెండు రోజుల్లో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు.

Godavari Pushkaralu | అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలి

Godavari Pushkaralu

ప్రధానంగా త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తి ప్రాంతానికి పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉండడంతో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైన చోట కల్వర్టులను నిర్మిస్తూ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, పుష్కర ఘాట్లకు మెరుగులు దిద్దాలని సూచించారు. కందకుర్తి పుష్కర ఘాట్ ను క్షేత్రస్థాయిలో సందర్శించాలని బోధన్ ఆర్డీవో విజయలక్ష్మిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్​వో బి.గీత, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Godavari Pushkaralu

ఇది కూడా చదవండి..:  Employee Health Cards | హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *