Bajaj Avenger Street 220 | మార్కెట్‌లోకి కొత్త బజాజ్ అవెంజర్..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bajaj Avenger Street 220 | దేశీయ క్రూయిజర్ బైక్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బజాజ్ ఆటో.. అవెంజర్ సిరీస్‌లో మరో మోడల్‌ను లాంచ్ చేసింది. అవెంజర్ 220 స్ట్రీట్ (Avenger 220 Street) పేరుతో దీనిని మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇటీవల చిన్న ఇంజన్ కలిగిన అవెంజర్ స్ట్రీట్ 160 ఉత్పత్తిని నిలిపివేసిన కంపెనీ.. దాని స్థానాన్ని మరింత శక్తిమంతమైన 220 సీసీ ఇంజన్‌తో భర్తీ చేసేందుకు కొత్త స్ట్రీట్ 220 ని లాంచ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం బజాజ్ వెబ్‌సైట్‌లో ఈ బైక్ కనిపిస్తోంది.

Bajaj Avenger Street 220 | ఇంజన్ సామర్థ్యం..

Bajaj Avenger Street 220

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220లో 220 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. సింగిల్ సిలిండర్‌తో పనిచేసే ఈ ఇంజన్.. 8,500 ఆర్పీఎం వద్ద 19 బీహెచ్పీ శక్తిని, 7,000 ఆర్పీఎం వద్ద 17.6 ఎన్ ఎం గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. నగర ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు అనుకూలంగా ఉండేలా దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు.

కలర్ ఆప్షన్స్ : బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 బైక్ ఎబోనీ బ్లాక్, కాక్‌టెయిల్ వైన్ రెడ్ అనే రంగుల్లో లభ్యమవుతోంది.

Bajaj Avenger Street 220 | ఇతర ఫీచర్లు

ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక వైపు 5 స్టెప్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. ముందువైపు 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్‌బ్రేక్, 130 ఎంఎం రియర్ డిస్క్‌బ్రేక్ ఇచ్చారు. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ సదుపాయం ఉంది. ఈ బైక13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. ఈ బైక్ బరువు 160 కిలోలు.

ధర : ఈ మోడల్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.30 లక్షలు. దీని ధర అవెంజర్ 220 క్రూయిజ్ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ.

ఇది కూడా చదవండి..: Stock Market Recovery | నాలుగు రోజుల నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన మార్కెట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *