Bodhan bypass robbery | బోధన్ బైపాస్‌పై దారుణం.. పోలీసులమంటూ మహిళకు బురిడీ.. 8.5 తులాల బంగారం చోరీ

తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bodhan bypass robbery | పోలీసులమంటూ ఓ మహిళను నమ్మించి ఆమె వద్ద ఉన్న 8.5 తులాల బంగారంతో పాటు నగదు, ఆధార్ కార్డు ఉన్న పర్సును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన బోధన్ బైపాస్ రోడ్డులోని రైతు దాబా సమీపంలో చోటుచేసుకుంది.

సాలంపాడ్ క్యాంప్‌నకు చెందిన బెజ్జం తిరుపతమ్మ ఆస్పత్రికి స్కూటీపై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. తాము పోలీసులమని పరిచయం చేసుకున్న వారు.. మెడలో బంగారు ఆభరణాలు ధరించి వెళ్లడం ప్రమాదకరమని ఆమెను నమ్మబలికారు. నగలను పర్సులో భద్రంగా పెట్టుకోవాలని సూచించారు.

Bodhan bypass robbery | పర్సులో పెట్టినట్లు నమ్మించి..

వారి మాటలను నమ్మిన తిరుపతమ్మ తన వద్ద ఉన్న 2.5 తులాల బంగారు చైన్, 6 తులాల బంగారు గాజులను తీసి పర్సులో పెట్టినట్లు సమాచారం. అనంతరం నిందితులు ఆ పర్సును కవర్‌లో చుట్టి ఇస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలో పర్సును తమ వద్ద ఉంచుకుని బైక్‌పై అక్కడి నుంచి ఉడాయించారు.

ఆస్పత్రికి చేరుకున్న తర్వాత పర్సు కనిపించకపోవడంతో తిరుపతమ్మకు అనుమానం వచ్చింది. తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పర్సులో 8.5 తులాల బంగారంతో పాటు రూ.2 వేల నగదు, ఆధార్ కార్డు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

Bodhan bypass robbery | పోలీసులు కీలక సూచన

బాధితురాలి ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

తాము పోలీసులమని చెప్పినా గుర్తుతెలియని వ్యక్తులకు నగలు, నగదు లేదా ఇతర విలువైన వస్తువులను అప్పగించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు అడ్డగిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *