BRS MLCs Suspension | రూల్స్ ఉల్లంఘన.. తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసెంబ్లీ ఆవరణలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల అంశంపై శాసనమండలి కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: BRS MLCs Suspension | తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై  ( Gaddam Prasad Kumar )అనుచిత వ్యాఖ్యలు, అసెంబ్లీ ఆవరణలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల అంశంపై శాసనమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి వివాదాస్పద రీతిలో ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు (, నవీన్ కుమార్ రెడ్డిలను ప్రస్తుత సమావేశాలు (సెషన్స్) మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

BRS MLCs Suspension | ఏకగ్రీవ తీర్మానంతో వేటు..

అసెంబ్లీ ఆవరణలో జరిగిన పరిణామాలు, స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సభలో చర్చించిన అనంతరం, బాధ్యులైన ఇద్దరు ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తీర్మాన కాపీని శాసనమండలికి పంపించగా.. దానిని పరిశీలించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మండలి కార్యదర్శి నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతరం మండలి సమావేశాలను చైర్మన్ రేపటికి వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి:  Damodara Rajanarsimha Comments | స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: దామోదర రాజనర్సింహ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *