May 23 Gold Rates | మూడు రోజుల ర్యాలీకి బ్రేక్.. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. పీక్స్‌లోనే వెండి!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 23 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ముడి ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు, అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి అంశాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు Silver Prices భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.  గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు తాజాగా కాస్త‌ బ్రేక్ పడింది.

May 23 Gold Rates | హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు ఉదయం 6.30 గంటల సమయంలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,480గా నమోదైంది.

అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,190 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,95,100గా ఉంది.

May 23 Gold Rates | ప్ర‌ధాన న‌గ‌రాల‌లో..

విజయవాడ Vijaywada మార్కెట్‌లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే స్థానిక పన్నులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరల పరిస్థితిని పరిశీలిస్తే..

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,230గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,779 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,480 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,190గా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు Gold Rates అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,630 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,540గా ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే చెన్నైలో కిలో వెండి ధర రూ.2.95 లక్షలకు చేరుకుంది. ఇతర ప్రధాన నగరాల్లో వెండి ధరలు రూ.2.85 లక్షల నుంచి రూ.2.90 లక్షల మధ్య కదలాడుతున్నాయి.

మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయాలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కూడా ఈ విలువైన లోహాల ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

BC Leader Targeted | కులాధిపత్య మీడియా ‘కుట్రల’ బట్టబయలు: బీసీ బిడ్డ ఉన్నత పదవిపై ‘రెడ్డి గారి ఛానెల్’ విషప్రచారం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *