అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crude Oil Prices | అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరకు రెక్కలొచ్చాయి. సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న సంకేతాలతో గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం నెగెటివ్‌గా స్పందించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ముగిశాయి.
Crude Oil Prices | గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 134 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 47 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 426 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 58 పాయింట్ల గ్యాప్ డౌన్ తో ప్రారంభమై 11 పాయింట్లు పెరిగింది. తిరిగి 135 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 307 పాయింట్ల నష్టంతో 76,957 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 24,080 వద్ద స్థిరపడ్డాయి.
Crude Oil Prices | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,858 కంపెనీలు లాభపడగా 2,572 స్టాక్స్ నష్టపోయాయి. 250 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 205 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 147 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్ లాభపడగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 1.87 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.74 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.50 శాతం, ఎస్బీఐ 1.33 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.02 శాతం లాభపడ్డాయి.
Top Losers : అదానీపోర్ట్స్ 4.11 శాతం, ఐటీసీ 3.67 శాతం, ఎయిర్‌టెల్ 2.76 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.53 శాతం, ఇన్ఫోసిస్ 1.50 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: West Asia Tensions | పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. నష్టాల్లో సూచీలు