Moto G37 Power | మోటో నుంచి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్.. సేల్ ఎప్పటినుంచంటే?

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moto G37 Power | ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన మోటోరోలా.. సరికొత్త మోడల్‌లో భారత వినియోగదారుల ముందుకువచ్చింది. బడ్జెట్ ధరలోనే పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్‌ (Smartphone)ను లాంచ్ చేసింది.

మోటో జీ37 పవర్ పేరుతో తీసుకువచ్చిన ఈ మోడల్ మంగళవారం (మే 19వ తేదీ)న భారత మార్కెట్‌లో విడుదలయ్యింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో వచ్చిన ఫోన్ సేల్ మే 25 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమవుతుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

Moto G37 Power | డిస్‌ప్లే..

6.66 ఇంచ్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 1604 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది.

Moto G37 Power | సాఫ్ట్‌వేర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటో హలో యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ టెలీ ఫొటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది. ఇది 4కే వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం : 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 6 వాట్ రివర్స్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్ : ఈ స్మార్ట్ ఫోన్ పాంటోన్ ఇంపెనెట్రబుల్, కాప్రి, నాటికల్ బ్లూ కలర్స్‌లో రెండు వేరియంట్స్ లో విడుదలయ్యింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 15,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 18,999.

ఇది కూడా చదవండి..: AI Job Crisis | వచ్చే ఐదేళ్లలో తీవ్ర ఉద్యోగ సంక్షోభం.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన హెచ్చరిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *