అక్షరటుడే, ఇందూరు: Governor Shiv Pratap | రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా జిల్లాకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకోగా ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ వచ్చారు.
Governor Shiv Pratap | స్వాగతం పలికిన ఎంపీ
గవర్నర్కు ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) సాదర స్వాగతం పలికారు. ఆనంతరం ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ తదితరులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కాన్వాయ్ ద్వారా గవర్నర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ఇది కూడా చదవండి..: Snake Bite Death | ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి