Srisailam Family Suicide | శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Family Suicide | ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను ఏపీలోని సత్యసాయి జిల్లా (Sathya Sai District)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఐదుగురు ఉరివేసుకుని తనువు చాలించారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15) గత నెలలో శ్రీశైలం వచ్చారు. వడ్డెర సత్రంలోని 11వ నంబర్ గదిని కుటుంబ సభ్యులు అద్దెకు తీసుకున్నారు.

Srisailam Family Suicide | ఆర్థిక ఇబ్బందులతో..

సత్రంలోని గది నుంచి కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి గమనించారు. గదిలో నుంచి దుర్వాసన రావడంతో తలుపులు తెరిచి చూశారు. దీంతో ఐదుగురు మృతి చెంది ఉన్నారు. బాత్రూమ్​లో ముగ్గురు, ఫ్యాన్​కు ఇద్దరు ఉరి వేసుకున్నారు. దీంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Vijay Sai Reddy | మత మార్పిడులను ప్రోత్సహించిన జగన్ : మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *