Stock Market Losses | నష్టాల్లో మార్కెట్లు..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధి వద్ద తాజాగా అమెరికా, ఇరాన్ ల మధ్య జరిగిన ఘటనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) నెగెటివ్ గా స్పందిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరగడం, రూపాయి మళ్లీ బలహీనపడడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం నష్టాల బాటలో సాగుతోంది.

Stock Market Losses | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 399 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 115 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 364 పాయింట్ల నష్టంతో 77,480 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 24,223 వద్ద ఉన్నాయి.

Stock Market Losses | బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ రంగాల్లో ఒత్తిడి..

బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్ నిఫ్టీ .90 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.72 శాతం, ఎనర్జీ 0.71 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.66 శాతం, రియాలిటీ, పవర్ 0.45 శాతం నష్టంతో ఉండగా.. ఐటీ 0.84 శాతం, ఫార్మా 0.54 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.30 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియన్ పెయింట్ 2.15 శాతం, అదానీపోర్ట్స్ 2.09 శాతం, టెక్ మహీంద్రా 1.10 శాతం, హెచ్ సీఎల్ టెక్ 1.06 శాతం, సన్‌ఫార్మా 0.86 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.70 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.65 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.53 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.52 శాతం, ఎల్ టీ 1.02 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Gold Rates Today | రికార్డు స్థాయికి బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ షాక్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *