Jammu Bus Accident | కొండపై నుంచి పడిన బస్సు.. 12 మంది మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jammu Bus Accident | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.

రామ్‌నగర్–ఉధంపూర్ మార్గంలోని జాలో ప్రాంతం సమీపంలో ఒక ప్రయాణికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఉధంపూర్‌ (Udhampur)కు వెళ్తున్న బస్సు అస్పష్టమైన పరిస్థితుల్లో ప్రమాదానికి గురైందని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఉధంపూర్ డీఐజీ శివ కుమార్ శర్మ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Jammu Bus Accident | కేంద్ర మంత్రి ఆరా

సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ మింగా షెర్పా (Deputy Commissioner Minga Sherpa)కు ఫోన్ చేశారు. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు ప్రజా రవాణా బస్సు ప్రయాణిస్తుండగా, కనోటే గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను తరలించడానికి ఎయిర్ అంబులెన్స్‌లను మోహరించినట్లు జితేంద్ర సింగ్ చెప్పారు.

ఇది కూడా చదవండి..: Tamil Nadu Explosion | టపాసుల పరిశ్రమలో పేలుడు.. 18 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *