Oliver Tree Helicopter Crash | బ్రెజిల్‌లో విషాదం.. గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ప్రముఖ సింగర్ మృతి

బ్రెజిల్‌లోని రియో డి జెనిరో గగనతలంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Oliver Tree Helicopter Crash | బ్రెజిల్‌లోని రియో డి జెనిరో గగనతలంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండు హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రముఖ అమెరికన్ సింగర్ ఒలివర్ ట్రీతో ( Oliver Tree ) సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Oliver Tree Helicopter Crash | ప్రమాదం ఎలా జరిగిందంటే..

నగరానికి పశ్చిమ ప్రాంతంలో ఈ రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం అవి నేలకూలాయి. అందులో ఒకటి సమీపంలోని ఒక కార్ డీలర్‌షిప్ పార్కింగ్ ప్రాంతంలో పడటంతో, అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ, అప్పటికే ఆరుగురు మరణించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. అయితే, విమానయాన అధికారుల వద్ద ఉన్న ప్రయాణికుల జాబితా ఆధారంగా బాధితులను గుర్తించారు. వీరిలో సింగర్ ఒలివర్ ట్రీతో పాటు, ఒక సంగీతకారుడు, అర్జెంటీనాకు చెందిన వీడియో డైరెక్టర్ , యూట్యూబర్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Oliver Tree Helicopter Crash | యువతను ఆకట్టుకున్న ఒలివర్ ట్రీ..

32 ఏళ్ల ఒలివర్ ట్రీ తన ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, పాటలతో ప్రపంచవ్యాప్తంగా యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్పాటిఫై (Spotify) వేదికపై ఆయన పాటలను నెలకు సుమారు 11 మిలియన్ల మంది వింటుంటారు. ప్రస్తుతం ఆయన తన వరల్డ్ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. మొత్తం 30 దేశాల్లో 70 ప్రదర్శనలు ఇవ్వాలని ప్లాన్ చేసుకున్న ఆయనకు, ఆదివారం జరిగిన ఈ ప్రమాదం ఆఖరిదిగా మిగిలిపోయింది.

ఇది కూడా చదవండి: Bharat Gas Theft | నగరంలో దొంగల హల్​చల్​.. భారత్​ గ్యాస్​ ఏజెన్సీలో చోరీ..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *