RTC Services | మారుమూల పల్లెలకూ ఆర్టీసీ సేవలను విస్తరించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో ఆర్టీసీ సేవలపై సమీక్ష నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: RTC Services | విద్యార్థులకు, ప్రజలకు, రైతులకు రవాణా వసతి మెరుగుపర్చేందుకు వీలుగా మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ(tsrtc buses) సేవలను విస్తరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో ఆర్టీసీ సేవలపై సమీక్ష నిర్వహించారు.

RTC Services | ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు..

ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండడం లేదని పలువురు ప్రజావాణిలో ఫిర్యాదులు చేయడం.. గ్రామాలకు బస్సులు రావాలని వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులతో కలెక్టర్​ సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల పరిధిలో ఆర్టీసీ బస్సు సర్వీసులు అవసరమైన మారుమూల గ్రామాలు, తండాల వివరాలను ఎంపీవోల ద్వారా సేకరించి, ఆ జాబితాను ఆర్టీసీ అధికారులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు బస్సులు నడిపించాలని సూచించారు. ప్రజల రాకపోకలకు (nizamabad transport) ఆస్కారం ఉన్న ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపడంతో అటు ప్రజలకు రవాణా సౌలభ్యం ఏర్పడడంతో పాటు ఆర్టీసీ సంస్థకు కూడా తగిన ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.

RTC Services |పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా..

ప్రస్తుతం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని.. ఖరీఫ్ సీజన్ పంటలు విత్తుకునేందుకు రైతులు ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల కోసం రాకపోకలు సాగిస్తారన్నారు. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం రవాణా వసతిపై (public transportation) ఆధారపడతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా నివాస ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు కొత్తగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపించాలని, అవసరమైన చోట ప్రయాణికులు, ప్రజల రద్దీని బట్టి బస్సు ట్రిప్​ల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

ఎంపీవోల ప్రతిపాదించిన జాబితాను పరిశీలించి, అవసరం ఉన్న అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతిపాదిత రూట్లలో వచ్చే సోమవారం నుండి ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని, పక్షం రోజుల తరువాత తాను మరోమారు సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, ఆర్టీసీ ఆర్ఎం మూర్తి, డిప్యూటి ఆర్ఎం మధుసూదన్, డిపో-1 మేనేజర్ ఆనంద్, అన్ని మండలాల ఎంపీవోలు పాల్గొన్నారు.

coll 3

ఇది కూడా చదవండి: US Attack on Ship | నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయుల మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *