అక్షరటుడే, వెబ్‌డెస్క్: Farmers Special Flight | ప్రభుత్వం పలు అవసరాల కోసం ప్రజలు, రైతుల నుంచి భూమిని సేకరిస్తుంది. అందుకు పరిహారం కూడా ఇస్తుంది. అనంతరం వారిని మరిచిపోతుంది. అయితే ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం మాత్రం ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక కానుక అందించింది.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ప్రత్యేక విమానంలో అధికారులు ఎక్కించారు. ఈ విమానాన్ని సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. జేవార్ నుంచి లక్నోకు తొలి వాణిజ్య విమానం చేరుకుంది. ఈ విమానంలో 172 మంది రైతులు ప్రయాణించారు. తొలి విమానంలో తమను తీసుకు వెళ్లడంపై భూములు ఇచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Farmers Special Flight | ఘన స్వాగతం
నోయిడా విమానాశ్రయం (Noida Airport)లో వాణిజ్య కార్యకలాపాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూమిని కోల్పోయిన 172 మంది రైతులు, ఈ కొత్త విమానయాన కేంద్రం నుండి బయలుదేరిన తొలి విమానాలలో ఒకదానిలో ప్రయాణించారు. 20 మంది మహిళలతో సహా ఈ రైతులు, స్థానిక ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) అధికారులతో కలిసి జేవార్‌లోని విమానాశ్రయం నుంచి లక్నోకు ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయినప్పుడు అందులోని ప్రయాణికులు చప్పట్లు కొట్టగా, సాంప్రదాయ వాటర్ కెనాన్ సెల్యూట్‌తో విమానానికి స్వాగతం పలికారు. రైతులు లక్నోలో సీఎం యోగీ ఆధిత్యానాథ్ను కలవనున్నారు.
Farmers Special Flight | ఆధునిక సౌకర్యాలు
ఈ విమానాశ్రయం సోమవారం బెంగళూరుకు తన తొలి సాధారణ వాణిజ్య సర్వీసును కూడా ప్రారంభించింది. ఇండిగో హైదరాబాద్, జైపూర్, చండీగఢ్ అమృత్‌సర్‌తో సహా 16 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు తన కార్యకలాపాలను క్రమంగా విస్తరించాలని యోచిస్తోంది. ఢిల్లీ ప్రధాన విమానాశ్రయంతో పోలిస్తే, ఈ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలను కల్పించారు.
ఇది కూడా చదవండి..: Pawan Kalyan Sena Prasthanam | దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు