Dichpally BC Association | విద్యుత్ బీసీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కార్యక్రమానికి రీజినల్ ప్రెసిడెంట్ ఎన్.వి. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ, తోట రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dichpally BC Association | విద్యుత్ బీసీ అసోసియేషన్ డిచ్‌పల్లి డివిజన్ జనరల్ బాడీ సమావేశం, డివిజన్ బాడీ ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

డిచ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడిగా జె. నరేష్ (లైన్‌మెన్), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి. ప్రవీణ్ (ఏఎల్ఎం), డివిజనల్ సెక్రటరీగా ఏ. బాలరాజ్, అడిషనల్ సెక్రటరీగా పి. కాశీరాం, సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ సెక్రటరీగా ఎం. గంగారాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

KTR Youth Sangrama | రేపే ‘యువ సంగ్రామ సదస్సు’.. యువత పెద్దఎత్తున తరలిరావాలి: కేటీఆర్

Dichpally BC Association | సమస్యలపై చర్చ..

ఈ సమావేశాన్ని రీజినల్ సెక్రటరీ బాశెట్టి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి రీజినల్ ప్రెసిడెంట్ ఎన్.వి. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ, తోట రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.

అలాగే ఏఈడీఈ అధికారులు ఆర్. బాలేష్, శంకర్ గౌడ్, ఏఈలు శ్రీనివాస్, భాస్కర్, రూప సాయి, మన్మోహన్, ఏవో అనిల్ కుమార్, జేఈవో మూర్తి, సబ్ ఇంజినీర్ దయానంద్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, లైన్‌మెన్ అరవింద్, సీనియర్ అసిస్టెంట్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు, సంఘం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *