అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Bike Thieves Arrested | నిజామాబాద్ నగరంలో వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను నిజామాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం (సెప్టెంబరు 5, 2026) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 బైక్‌లు, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.
Nizamabad Bike Thieves Arrested |
పోలీసుల కథనం ప్రకారం.. ఆర్ఆర్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం టూటౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఒకే మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి, వాహన పత్రాలను (డాక్యుమెంట్లను) చూపించాల్సిందిగా కోరారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చి స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు.
Yusmarg Encounter | యూస్‌మార్గ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్.. లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ మృతి
Nizamabad Bike Thieves Arrested | జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు..
విచారణలో వారు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకొన్నారు. నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్, డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు.
అరెస్టయిన నిందితులను గుమ్ముల వినయ్ దత్త (కోటగల్లి), కోలీ రోహన్ (కోటగల్లి), ముక్కల సంతోష్ (ఫులాంగ్)గా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 4 వాహనాలను (2 బైక్‌లు, 2 స్కూటీలు) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం 14 రోజుల పాటు అబ్జర్వేషన్ హోమ్‌కు పంపించినట్లు టూటౌన్ పోలీసులు వెల్లడించారు.