Gram Sabha Meetings | గ్రామ, వార్డు సభలను సమర్ధవంతంగా నిర్వహించాలి

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఇందూరు: Gram Sabha Meetings | గ్రామ, వార్డు సభలను సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), భుజంగరావు దిశానిర్దేశం ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్​లో బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Gram Sabha Meetings | ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి

Gram Sabha Meetings

ఈ నెల 4, 6, 8, 10వ తేదీల్లో గ్రామ, వార్డు సభలను పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అదనపు కలెక్టర్లు సూచించారు. సభ నిర్వహణకు ఒకరోజు ముందే టాంటాం ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు ముందస్తుగానే సమాచారం తెలియజేయాలని తెలిపారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియ గురించి సభలలో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

Gram Sabha Meetings | బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకం

ఎస్.ఐ.ఆర్ అమలులో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర క్రియాశీలకం అయినందున రాజకీయ పార్టీలు సత్వరమే బీఎల్ఏలను నియమించుకోవాలని అదనపు కలెక్టర్లు సూచించారు. నిర్దేశిత నమూనాలో జాబితాను సమర్పించేలా ప్రజాప్రతినిధులను కోరాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎల్​నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దరిమిలా పంటల మార్పిడి ఆవశ్యకత గురించి రైతులకు తెలియజేయాలన్నారు.

Gram Sabha Meetings

పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకతను వివరించాలన్నారు. ప్రకృతి సమతుల్యత కోసం అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని చెప్పారు.సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్ఓ గీత, డీఎఫ్​వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bodhan Politics | బోధన్ మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు.. షాడో ఛైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *