Banswada Road Accident | కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Road Accident | కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బాన్సువాడ (Banswada) పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది.

Banswada Road Accident | మోటార్​ సైకిల్​పై వెళ్తుండగా..

సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం… బిచ్కుంద (Bichkunda) మండలం గోపన్​పల్లి గ్రామానికి చెందిన కురుమ హన్మాండ్లు (58) స్నేహితులతో కలిసి కుస్తీ పోటీలు వీక్షించేందుకు బాన్సువాడకు వచ్చాడు. మధ్యాహ్నం తాడ్కోల్ చౌరస్తాలో టిఫిన్ చేసిన అనంతరం బస్టాండ్ వైపు తన మోటార్ సైకిల్​పై వెళ్తుండగా.. కొయ్యగుట్ట వైపు నుంచి వస్తున్న డీసీఎం బైక్​ను ఢీకొట్టింది. దీంతో హన్మాండ్లు కిందపడగా, వాహనం టైరు పైనుంచి వెళ్లడంతో హన్మాండ్లు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కురుమ బీరవ్వ ఫిర్యాదు మేరకు కేసు (Banswada Police) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: RTC JAC talks | ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల చర్చ.. డిమాండ్లపై సానుకూలం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *