IPS Transfers | రాష్ట్రంలో పలువురు సీనియర్​ ఐపీఎస్​ల బదిలీ..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPS Transfers | తెలంగాణ రాష్ట్రంలో పలువురు సీనియర్​ ఐపీఎస్​లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్​ సెక్రెటరీ కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురు ఐపీఎస్​లకు స్థాన చలనం కల్పించారు.

IPS Transfers | ఏడుగురికి బదిలీ..

విజిలెన్స్ డీజీగా ఉన్న​ శిఖ గోయల్​ను హోంశాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీగా బదిలీ చేశారు. పోలీస్​ పర్సనల్​ అడిషనల్​ డీజీగా ఉన్న దేవేంద్ర సింగ్​ చౌహాన్​ను విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీగా నియమించారు. డ్రగ్స్​ కంట్రోల్​ డీజీగా ఉన్న షాన్వాజ్​ కాసీంను మల్టీజోన్​–2 ఐజీగా బదిలీ చేశారు. ఏసీబీ డైరెక్టర్​గా ఉన్న తరుణ్​ జోషిని ఫ్యూచర్​ సిటీ కమిషనర్​గా నియమించారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న సుధీర్​బాబు ఈ నెలాఖరున రిటైర్​ కానున్నారు. ఇక మేడ్చల్​ మల్కాజ్​గిరి సీపీగా ఉన్న అవినాష్​ మహంతిని డ్రగ్స్​ కంట్రోల్​ డైరెక్టర్​, ఏసీబీ డైరెక్టర్​గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్​ఐబీ ఐజీపీగా ఉన్న బి.సుమతిని మేడ్చల్​ మల్కాజ్​గిరి సీపీగా బదిలీ చేశారు. ఇంటలిజెన్స్​ ఐజీగా ఉన్న కార్తికేయకు ఎస్​ఐబీ ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. త్వరలో మరికొంత మంది ఐపీఎస్ అధికారులు​ బదిలీ అయ్యే అవకాశం ఉంది.

IPS Transfers

 

ఇది కూడా చదవండి..: IAS IPS transfers | త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్​ల బదిలీలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *