అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Model School Teachers Salaries | మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలివ్వాలని టీపీటీఎఫ్ (TPTF Nizamabad) జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ కోరారు. నగరంలో(Nizamabad) టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి గోదారి అర్వింద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Model School Teachers Salaries | పీడీలను రెగ్యులరైజ్ చేయాలి
మోడల్ స్కూళ్లలో పనిచేసే ఫిజికల్ డైరెక్టర్లను రెగ్యులరైజ్ చేస్తూ వేతన స్కేలు అమలు చేయాలని వెనిగళ్ల సురేష్ అన్నారు. విధినిర్వహణలో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్మెంట్, న్యూ హెల్త్‌కార్డులు అందజేయాలన్నారు. మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా మార్చే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నందిపేట్, డిచ్పల్లి, మోపాల్, మాక్లూర్, కమ్మర్పల్లి, పోతంగల్, వర్ని కమిటీల బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, సౌత్ మండల అధ్యక్షుడు గోపి, కార్యదర్శి నరేందర్, మహేష్, గంగాధర్, ప్రవీణ్, గంగాదాస్, అప్పారావు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మియాపూర్ భూముల హిస్టరీ ఇదే