Retired Army Soldier | సైనికుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం..

సైనికుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని రియల్​ టైగర్స్​ ప్రతినిధులు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Retired Army Soldier | సైనికుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని రియల్​ టైగర్స్​ ప్రతినిధులు పేర్కొన్నారు. సైన్యంలో 17ఏళ్ల పాటు సేవలందించిన ఉద్యోగ విరమణ చేసిన సీతారాంను రైల్వేస్టేషన్​లో (Nizamabad) ఘనంగా స్వాగతించారు.

Retired Army Soldier |  సుదీర్ఘకాలం సేవలందించి..

భారత సైన్యంలో 17 ఏళ్ల పాటు అంకితభావంతో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన నిజామాబాద్ నగరానికి చెందిన మాజీ సైనికుడు సీతారామ్ జిల్లాకు చేరుకున్నారు. దేశ రక్షణే ధ్యేయంగా సుదీర్ఘకాలం సైన్యంలో విధులు నిర్వర్తించి స్వస్థలానికి చేరుకున్న సీతారామ్​కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రియల్ టైగర్స్ సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సైన్యంలో 17 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించిన సీతారామ్ ను రియల్ టైగర్స్ సభ్యులు అభినందించారు.

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే సైనికుల సేవలు వెలకట్టలేనివని, సైనికుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్సై బన్సీలాల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రియల్ టైగర్స్ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని సీతారామ్​కు అభినందనలు తెలియజేశారు. దేశ సేవ చేసిన సైనికుడికి లభించిన ఈ ఆత్మీయ స్వాగతం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇది కూడా చదవండి: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *