నిజామాబాద్Medicover Hospital | క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం: మెడికవర్​ ఆస్పత్రి వైద్యులు

Medicover Hospital | క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం: మెడికవర్​ ఆస్పత్రి వైద్యులు

క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని మెడికవర్​ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

అక్షరటుడే, ఇందూరు: Medicover Hospital | క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే చికిత్స (cancer treatmen) సులభమవుతుందని మెడికవర్(Medicover)​ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Medicover Hospital | పది నిమిషాలకో కొత్త క్యాన్సర్​ కేసు..

ఈ సందర్భంగా మెడికవర్​ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్టు (oncology) & రోబోటిక్ సర్జన్ (Robotic Surgeon) రవి చందర్ వెలిగేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 53 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. దీంట్లో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త కేసు వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో.. ముఖ్యంగా నిజామాబాద్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘క్యాన్సర్ చికిత్సలో ప్రెసిషన్ థెరపీలు, సమగ్ర వైద్య విధానాలు’ అనే అంశంపై మాట్లాడారు.

Medicover Hospital | క్యాన్సర్​ను ముందుగానే గుర్తిస్తే..

‘క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడే అత్యంత కీలక అంశమని డాక్టర్​ రవి చందర్ వెలిగేటి తెలిపారు. రోబోటిక్, మినిమల్లి ఇన్వేసివ్ సర్జరీల (Minimally Invasive Surgery) వల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, త్వరితగతిన కోలుకునే అవకాశం లభిస్తోంది. ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభిస్తే పూర్తి నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని సూచించారు. కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ (Radiation Oncologist)​ డాక్టర్​ అన్వేష్ ఎండ్ల మాట్లాడుతూ.. ఆధునిక రేడియేషన్ టెక్నాలజీలు మిల్లీమీటర్ స్థాయిలో కచ్చితత్వంతో పనిచేస్తాయన్నారు. ఇవి కేవలం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని, ఆరోగ్యకర కణజాలాన్ని రక్షిస్తాయన్నారు. దీంతో దుష్ప్రభావాలు తగ్గి, రోగులు సురక్షితంగా, సమర్థవంతంగా చికిత్స పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.

జీవనశైలిలో మార్పులు రావాలి..

సెంటర్ హెడ్ సంపత్ మాట్లాడుతూ.. నిజామాబాద్(Nizamabad), పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా బ్రెస్ట్, సర్వికల్, మౌత్, లంగ్ క్యాన్సర్ కేసులు అధికంగా కనిపిస్తున్నాయన్నారు. జీవనశైలి మార్పులు, పొగాకు వినియోగం, ఆలస్యంగా పరీక్షలు చేయించుకోవడం ప్రధాన కారణాలుగా చెప్పుకొచ్చారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చన్నారు. అదేవిధంగా నిజామాబాద్​ మెడికవర్​లో మల్టీడిసిప్లినరీ విధానం ద్వారా ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, సర్జన్లు, ఇతర నిపుణులు కలిసి ప్రతి రోగికి సమగ్ర చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన లక్ష్యమని వారు వెల్లడించారు.

Medicover Hospital

ఇది కూడా చదవండి: MLC Appointments Approval | ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్.. సంతకం చేసిన గవర్నర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...