Nepal Floods | వరదలు తట్టుకొని నిలబడిన భవనం.. ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

నేపాల్​లో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఆ దేశం అతలాకుతలం అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nepal Floods | నేపాల్ (Nepal)​లో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఆ దేశం అతలాకుతలం అయింది. వందలాది మంది చనిపోయరు. ఎంతో మంది గత్లంతు అయ్యారు. ఇంకా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వరద ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. పేకమేడల్ల కూలిపోయాయి. అయితే ఓ భవనం మాత్రం వరదను తట్టుకొని నిలబడింది. వేగంగా ప్రవహిస్తున్న బురద నీటి మధ్య చిక్కుకున్న ఆకుపచ్చ రంగు ఇంటికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ ఇంట్లో ఒక కుటుంబం చిక్కుకుపోయి ఉండటాన్ని చూసిన ప్రజలు ఆందోళన చెందారు.

Nepal Floods | నెటిజన్ల హర్షం

ఆ ఇంటికి సంబంధించిన మొదటి వైరల్ వీడియో ప్రకారం, వరద నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నప్పుడు, ఇంటి చుట్టూ ఉన్న అనేక నిర్మాణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ భవనం కూడా కూలిందని ప్రజలు భావించారు. అయితే అది కూలలేదు. అందులోని కుటుంబం క్షేమంగా బయటపడింది. మొదట వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆందోళన చెందారు. ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించారు. వరదల అనంతరం ఆ భవనానికి సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. అందులో కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. దీంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Venezuela US Oil Deal | వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *